Armaan Malik: వివాహబంధంలోకి అడుగు పెట్టిన అర్మాన్ మాలిక్.! 3 d ago
"బుట్టబొమ్మ" సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు దేగ్గరైన సింగర్ అర్మాన్ మాలిక్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు, ఇన్ఫ్లూయెన్సుర్ "ఆష్నా ష్రాఫ్" ను అర్మాన్ పెళ్లి చేసుకున్నారు. ఇరువురి కుటుంబాల పెద్దలు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన ఫోటోలను తాజాగా అర్మాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.